ప్రివ్యూ - టిక్‌టాక్ తెచ్చిన సొంత ఫోన్ స్మార్టిస‌న్ 

టిక్‌టాక్ గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం చేయ‌క్క‌ర్లేదు. ముస‌లోళ్ల నుంచి పిల్లోళ్ల దాకా ఆబాల గోపాలాన్ని ఊపేస్తుంది ఈ యాప్‌. వ‌చ్చిన కొన్ని నెల‌ల‌కే ప్ర‌తి ఒక్క‌రికి ఈ యాప్ ఒక వ్య‌స‌నంలా మారిపోయింది.  టిక్ టాక్‌లో ఫేమ‌స్ అవ‌డం కోసం చాలా మంది చాలా ప్ర‌మాదాలు కూడా కొని తెచ్చుకున్నారు. జ‌నాల్లో త‌మ యాప్‌కు ఉన్న ఆద‌ర‌ణ చూసిన ఈ చైనా కంపెనీ వెంట‌నే టిక్‌టాక్ పేరిట ఒక ఫోన్‌ను రిలీజ్ చేసింది. మ‌రి ఏమిటి ఈ ఫోన్.. దీని ప్ర‌త్యేక‌త ఏంటి?

స్మార్టిస‌న్ జియాంగో
చైనా యాప్ టిక్‌టాక్ నుంచి వ‌చ్చిన కొత్త ఫోన్ పేరు స్మార్టిస‌న్ జియాంగో ప్రొ 3... ఇది మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో ల‌భ్యం అవుతుంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ దాదాపు 29 వేల వ‌ర‌కు ఉంది. ఇక 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ 22 వేల ధ‌ర‌లో ల‌భిస్తుంది. `12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 36000 వేల ధ‌ర‌కు మ‌నం కొనుక్కోవ‌చ్చు. 

4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
స్మార్టిస‌న్ ఫోన్లో బ్యాట‌రీ కూడా యూజర్ల‌ను ఆక‌ర్షించేలా ఉంది. దీని రేంజ్ 4000 ఎంఏహెచ్‌. 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే దీని ప్ర‌త్యేక‌త‌. స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్ల‌స్ చిప్‌సెట్ ప్రాసెస‌ర్, స్పోర్ట్స్ క్వాడ్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంది. దీనిలోనే 48 ఎంపీ  సోని ఐఎంఎక్స్ 586 సెన్సార్‌, 13 ఎంపీ  వైడ్ యాంగిల్ లెన్స్‌, 8 ఎంపీ టెలిఫొటో లెన్స్, 5 ఎంపీ మైక్రో లెన్స్‌, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాల‌జీ లాంటి స్పెసిఫికేష‌న్లు దీనిలో ఉన్నాయి.

TIKTOK MAKER BYTEDANCE FIRST SMARTPHONE SMARTISAN JIANGUO PRO 3